గ్రేటర్ ఎన్నికల గురించి మీకు ఈ విషయాలు తెలుసా ఎంత ఖర్చు చేయాలి

గ్రేటర్ ఎన్నికల గురించి మీకు ఈ విషయాలు తెలుసా ఎంత ఖర్చు చేయాలి

0
89

హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల సందడి మొదలు కానుంది, మహానగరంలో ఓటరు ఈసారి ఎవరి వైపు ఉంటాడో చూడాలి, 18వ తేది అంటే బుధవారం నుంచే జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మరి ఈ ఎన్నికల్లో అసలు ప్రాసెస్ ఏమిటి, మేయర్ పీఠం ఎవరికి కేటాయిస్తారు రిజర్వేషన్ల ప్రకారం అనేది చూద్దాం.

గ్రేటర్ మేయర్ పదవి మహిళ (జనరల్)కు ..నవంబర్-18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది
నవంబర్- 20న నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు..నవంబర్- 21న నామినేషన్ల పరిశీలన
నవంబర్- 24న నామినేషన్ల ఉపసంహరణ తేది,డిసెంబర్- 01న పోలింగ్ జరుగుతుంది గ్రేటర్ లో
డిసెంబర్-03న అవసరమైతే రీపోలింగ్ నిర్వహిస్తారు ఏదైనా ఇబ్బంది వచ్చి ఉంటే
డిసెంబర్-04న ఓట్ల లెక్కింపు.. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు
డిసెంబర్-01న ఉదయం 7నుంచి సాయంత్రం 6గంలకు వరకు పోలింగ్ జరుగుతుంది.

ఇక డిపాజిట్లు చూడాలి
ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్దులు పోటి చేస్తే వారికి గుర్తులు కేటాయిస్తారు
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 డిపాజిట్ నగదు చెల్లించాలి
పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ. 5వేలు డిపాజిట్ ఉంటుంది
కచ్చితంగా ఆన్లైన్లో నామినేషన్ ఫామ్ను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి.
తాజా ఓటర్ లిస్ట్ ప్రకారం గ్రేటర్లో మొత్తం ఓటర్స్ 74లక్షల 4 వేల 286 మంది
మొత్తం పురుషులు 38లక్షల 56వేల 770
మహిళలు 35లక్షల 46వేల 847 మంది
ఇతరులు 669 మంది
హైదరాబాద్ లో మొత్తం 9, 248 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి.
150 డివిజన్లలోనూ బ్యాలెట్ పద్ధతినే పోలింగ్ నిర్వహిస్తారు
గ్రేటర్లో అతిపెద్ద డివిజన్ మైలార్ దేవులపల్లి 79వేల 290 మంది ఓటర్లు ఉన్నారు
చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు ఉన్నారు

ఇక మరి అభ్యర్దులు ఖర్చు ఎంత చేయాలి అనేది కూడా పరిమితి ఉంటుంది
ఏ అభ్యర్ది అయినా రూ.5 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు
పోటిచేసిన అభ్యర్ది 45రోజుల లోపు ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించాలి.
గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు
నవంబర్ 21 పోలింగ్ కేంద్రాలు ప్రకటిస్తారు.