గ్రేటర్ హైదరాబాద్ ఓటరు ఈసారి కూడా ఇంటి నుంచి పెద్దగా బయటకు వచ్చి ఓట్లు వేసింది లేదు.. అత్యల్పంగానే ఓట్లు వేస్తున్నారు.అయితే ఎంత ప్రచారం చేసినా అతి తక్కువగానే ఓటరు వచ్చి ఓటింగ్ చేస్తున్నారు, ఇక ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతోంది.
సాధారణంగా ఎన్నికల ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ను ప్రకటిస్తాయి మీడియా సంస్థలు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపై అంచనాలు వెల్లడిస్తాయి. మరి పలు సర్వేయూనిట్లు ఇప్పటికే సర్వేలు చేశాయి, అయితే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ బయటకు రావు, సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటన ఉండదు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికారుల తప్పిదం కారణంగా పార్టీ గుర్తులు మారిపోయాయి. బ్యాలెట్ పేపర్పై ఒక పార్టీ గుర్తు ముద్రించాల్సి ఉండగా, మరో పార్టీ గుర్తును ముద్రించారు. దీంతో 26వ డివిజన్ ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు అయింది. ఇక్కడ రీ పోలింగ్ ఉంటుంది.. దీంతో ఎగ్జిట్ పోల్స్ ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటికి బ్రేక్ వేశారు. ఈనెల 4 న ఫలితాలు రానున్నాయి.