కరోనా పాజిటీవ్ వస్తే భారీ నగదు బహుమతి – స్టూడెంట్స్ వింత పార్టీ

కరోనా పాజిటీవ్ వస్తే భారీ నగదు బహుమతి - స్టూడెంట్స్ వింత పార్టీ

0
83

కొందరు నిజంగా వింతగా ఆలోచన చేసేవారు ఉంటారు, అయితే ఇలాంటి విపత్కర పరిస్దితిలో కూడా పిచ్చ ఆలోచనలు ఆలోచించి సమాజంలో ఇష్టం వచ్చినట్లు ఉంటే వారిని ఏమనాలి, ప్రభుత్వాలు వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఈ కరోనా సమయంలో అందరూ జాగ్రత్తగా ఉంటున్నారు.

బయటకు రావడం లేదు.. కాని అమెరికాలో ఇంత దారుణంగా వైరస్ వ్యాప్తి ఉంటున్నా కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు, సామాజిక దూరం మాస్క్ పెట్టుకోవడం మానేశారు.
విద్యార్థులు వైరస్ను ఇతరులకు అంటించేందుకు పార్టీలు ఆర్గనైజ్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

అలబామాలో కరోనా వైరస్ పార్టీలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వైరస్ వ్యాప్తికి సహకరించేలా విద్యార్థులు పార్టీలు నిర్వహించడం షాక్కు గురిచేస్తోంది. ఇలా చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు, దీనికి కారణం ఏమిటి అనేది చూస్తే వారు అందరూ కూడా పార్టీలకు వెళ్లినవారే, కేసులు ఇలా పెరుగుతున్నా ఇంకా పార్టీలు మరిన్ని రోజు చేసుకుంటున్నారు.

కొందరు వర్శిటీ విద్యార్థులు కోవిడ్ పేరిట పార్టీలు నిర్వహించారు. దీనికి పాజిటీవ్ వచ్చిన స్టూడెంట్స్ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే వారి ద్వారా పార్టీకి హాజరైనవాళ్లలో ఎవరికి ముందుగా వైరస్ సోకుతుందో వాళ్లు విజేతలు వారికి బహుమతులు ఇస్తున్నారట…ఇదేం వింత ఆలోచనో.