Breaking: అల్లం నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం

0
80

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా  అల్లం పద్మక్క అనారోగ్య సమస్యతో నిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది. ఆమెకు AB+ve బ్లడ్ అవసరం ఉండగా కొంతమంది జర్నలిస్టులు రక్తదానం కూడా చేశారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. దీనితో జర్నస్టుల సంఘంలో విషాధచాయలు అలముకున్నాయి. మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను సిఎం ఈ సందర్భంగా యాది చేసుకున్నారు. అల్లం నారాయణను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు వారి కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు.