ఆడపిల్లలకు కేంద్రం గుడ్ న్యూస్ బడ్జెట్ లో కొత్త వరం

ఆడపిల్లలకు కేంద్రం గుడ్ న్యూస్ బడ్జెట్ లో కొత్త వరం

0
91

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2020 ప్రకటించింది.. రైతులకి వరాలు ఇస్తోంది, అలాగే విద్యారంగానికి ఎన్నో వరాలు ప్రకటించారు, విద్యార్దులకి సరికొత్త హామీలు ఇచ్చారు.. కొత్త యూనివర్శిటీలు కొత్త కోర్సులు రానున్నాయి, తాజాగా ఆడపిల్లలకు కూడా గుడ్ న్యూస్ వినిపించింది కేంద్రం.

ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనుంది, ఎన్నో ఏళ్లుగా ఇది కావాలి అని కోరుతున్నారు. మన దేశంలో అన్ని స్టేట్స్ లో కూడా పాఠశాల స్థాయి ఉన్నత విద్య వరకు బాలికలు ముందంజలో ఉన్నారు అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలియచేశారు. ఈ సమయంలో
బేటీ బచావో బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది అని ఆమె ప్రకటించారు.

ప్రాథమిక స్థాయి విద్యలో బాలుర కంటే బాలికలే ఐదు శాతం ఎక్కువ ఉన్నారు అని ఇది మహిళల విజయం అని ఆమె తెలిపారు.ఆరు లక్షలమంది అంగన్వాడీలకు సెల్ఫోన్లు ఇవ్వనున్నారు.. అంతేకాకుండా పిల్లలకు పౌష్టికాహారం, హెల్త్కేర్పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.. మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు ఖర్చు చేయనుంది ఈ ప్రభుత్వం అని ప్రకటించారు.. అలాగే దేశంలో పౌష్టికాహార పథకానికి రూ. 35.6 కోట్లు కేటాయించనున్నారు.. ఇది సరిగ్గా రన్ అయ్యేలా ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనుంది కేంద్రం.