తిరుమలలో గాజు వాటర్ బాటిల్స్ – ధర ఎంతో తెలుసా ? డిపాజిట్ చేయాలి

తిరుమలలో గాజు వాటర్ బాటిల్స్ - ధర ఎంతో తెలుసా ? డిపాజిట్ చేయాలి

0
113

తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేదించిన సంగతి తెలిసిందే.. ఎక్కడికక్కడ వాటర్ సరఫరా చేస్తాము అని తెలిపారు తితిదే అధికారులు.. ఈ సమయంలో తిరుమలకు కొండకు త్వరలో గాజు నీళ్ల సీసాలు బాటిల్స్ రూపంలో రానున్నాయి. ఇప్పటికే ప్లా స్టిక్- పాలిథిన్ ఉత్పత్తుల నిషేధంలో భాగంగా ప్లాస్టిక్ నీళ్ల సీసాల అమ్మకం పూర్తిగా ఆగిపోయింది మొత్తం ఆపేశారు ఎవరిదగ్గరైన ఉన్నా వాటిని తీసేసుకుంటున్నారు.

ఇకపై తిరుమల వచ్చే యాత్రికులకు తాగునీటి సమస్య లేకుండా.. ఓ కంపెనీకి చెందిన గాజు నీళ్లసీసాల విక్రయానికి టీటీడీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా బిస్సెల్స్ సంస్థ గాజు నీళ్ల సీసాలను తిరుమలలో ప్రయోగాత్మకంగా పదిరోజులపాటు అమలు చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. అయితే గాజు వాటర్ బాటిల్ అంటే ఖరీదు ఉంటుందనిఅందరూ అనుకుంటారు

కాని ఇది 20 రూపాయలకే అందిస్తారు. వీటిని కొండపై అన్నీ చోట్ల ఇకపై అమ్మనున్నారు.బాటిల్ కూడా తమ వెంట తీసుకువెళ్లాలంటే కచ్చితంగా మరో రూ.20 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఖాళీ బాటిల్ను తిరుమలలోని ఏ దుకాణంలో ఇచ్చినా రూ.20 తిరిగి ఇచ్చేలా విధానం రూపొందించారు. దీంతో ఇక తాగునీటికి సమస్య ఉండదు తిరుమల కొండపై.