మన దేశంలో చాలా మంది సరదాగా వెళ్లాలి అనుకునే ప్లేస్ గోవా, అయితే చాలా మంది సమ్మర్ ప్లాన్ చేసుకునేది గోవాకే, అయితే గోవాకి ఈసారి వెళ్లడానికి లేదు, ఎందుకు అంటే దేశంలో లాక్ డౌన్ ఉంది, దీంతో మార్చి- ఏప్రిల్- మే ఈ మూడు నెలలు ఇక అక్కడకు ఎవరూ ప్లాన్ చేసుకోలేదు…
పర్యాటకం. అందమైన సముద్ర తీర అందాలు, అక్కడి విభిన్న సంస్కృతి, తక్కువ ధరకే లభ్యమయ్యే లగ్జరీ హోటల్స్. గోవా అందాలకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. అందుకే అందరూ అక్కడకు వెళుతూ ఉంటారు, కాని మూడు నెలలుగా అక్కడ అన్నీ బంద్ అయ్యాయి.
ప్రధానంగా టూరిజం మీదే ఆధారపడిన గోవా, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. అయితే పర్యాటకులని ఆహ్వనించేందుకు స్టేట్ సిద్దంగా ఉంది అని తెలిపారు సీఎం ప్రమోద్ సావంత్ .. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలి అని తెలుపుతున్నారు. మొత్తానికి అన్నీ సెట్ అయితే గోవాకి ఇక టూర్ కి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.