కరీంనగర్ లో వివి ప్యాడ్ ల గోల్ మాల్ జరిగిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నడిరోడ్డుపై వివి ప్యాడ్ లు కారులోకి మార్చారని ఆరోపించారు. మొదటి నుంచి ఎన్నికల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరైన సెక్యూర్టీ లేకుండా ఈవీఎంలు, వివి ప్యాడ్స్ తరలింపు ఈవీఎంలు తరలించే వాహనాలు ఆకారంగా మధ్యలో నిలిపి వేశారనీ బీజేపీ శ్రేణులు ఆరోపించారు.
ఎన్నికల నిర్వహణ తీరు, ఈవీఎంలు తరలింపులో నిర్లక్ష్యంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి సమగ్ర విచారణ జరిపి జిల్లా కలెక్టర్ సహా బాధ్యలపై చర్యలు తీసుకోవాలని బిజెపి శ్రేణులు డిమాండ్ చేశారు. రోడ్డుపై వివి ప్యాడ్ తరలించిన వ్యక్తిని బిజెపి శ్రేణులు నిలదీయగా మీరు ఎవరు అడగడానికి అంటూ పోలీస్ లు నిందితున్ని తప్పించే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యం వహించిన కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.