బంగారం ధర ఎంత పెరిగిందో అంతా తగ్గుతూనే వస్తోంది, నేడు మార్కెట్లో మాత్రం బంగారం ధర సాధారణంగా నిలకడగా ఉంది, ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీయ మార్కెట్‌లో పసిడి స్థిరంగా ఉంది,ముఖ్యంగా బంగారం దిగుమతులు కూడా భారీగా తగ్గాయి.
ఇక్కడ సేల్ లేకపోవడం డిమాండ్ తగ్గడం ఆభరణాల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో పది రోజులుగా తయారీ వర్క్ లేదు, ఇక రేటు ఎంత పెరిగినా సేల్స్ తగ్గుతున్నాయి అంటున్నారు వ్యాపారులు..హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పు లేదు. రేటు 55,460 ఉంది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ఆర్నమెంట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.50,840 ట్రేడ్ అవుతోంది.
ఇక వెండి ధర కూడా స్దిరంగా ఉంది…రూ.67,800కు చేరింది. ఇక వెండి ధర ఇలా ఉంటే వచ్చే రోజుల్లో బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అనలిస్టులు, చాలా వరకూ డిమాండ్ లేకపోవడం ఇలా రేటు తగ్గుతోంది.