బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పడుతోంది. నాలుగు రోజులుగా బంగారం ధర కాస్త తగ్గుతోంది, ఇక మార్కెట్లో నేడు కూడా పసిడి ధర తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.55,060కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.50,480కు పడిపోయింది.
పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.700 దిగొచ్చింది. దీంతో ధర రూ.67,100కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.
షేర్ల ర్యాలీ పెరుగుతోంది, ఈ సమయంలో బంగారం కంటే షేర్లలోనే పెట్టుబడి పెడుతున్నారు ఇన్వెస్టర్లు. అందుకే ప్రధానంగా బంగారం ధర తగ్గుతోంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.