తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది, ఇప్పుడు మార్కెట్లో గడిచిన పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర మార్కెట్లో నేడు పెరుగుదల నమోదు చేసింది, ఇక వెండి కూడా ఇలా పెరుగుదల కనిపించింది, అయితే హైదరాబాద్ లో అమ్మకాలు మళ్లీ పెరిగాయి, గడిచిన నెలలో భారీ అమ్మకాలే జరిగాయి, ఒకే రోజు 1600 తగ్గిన పసిడి ఇప్పుడు రేటు ఎలా ఉందో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగింది. రూ.49,260కి చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.45,150కు చేరింది.
బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఏకంగా రూ.3,100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.67,700కు చేరింది.
ఇక బంగారం ధర వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందా లేదా తగ్గుతుందా అంటే వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, ముఖ్యంగా షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి ఇదే ప్రధాన కారణం అని తెలియచేస్తున్నారు.