బంగారం ఇప్పుడు కొనచ్చా వద్దా నిపుణులు ఏమంటున్నారు.

బంగారం ఇప్పుడు కొనచ్చా వద్దా నిపుణులు ఏమంటున్నారు.

0
99

బంగారం కొనాలి అంటే ఇప్పుడు కొనెయ్యండి ఎందుకు అంటే బంగారం ధర భారీగా పెరగవచ్చు అంటున్నారు నిపుణులు.. గత ఏడాది పది గ్రాములు 57 వేల వరకూ చూశాం కరోనా సమయంలో… ఇంత దారుణంగా పెరిగింది బంగారం.. కాని ఇప్పుడు బంగారం ధర నేల చూపులు చూస్తోంది.. భారీగా తగ్గుతోంది.. ముఖ్యంగా 4100 నుంచి 4200 మాత్రమే ఆర్నమెంట్ గోల్డ్ అమ్మకాలు జరుగుతున్నాయి..

 

ఇక బంగారం భారీగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు పెరిగాయి, ఇక పెద్ద పెద్ద జ్యూవెలరీ సంస్ధలు కూడా

మంచి ఆఫర్లు ఇస్తున్నాయి, అయితే ఈ ధర ఇలాగే ఉంటుందా అంటే కొద్ది రోజులు మాత్రమే ఇలా ధర ఉంటుంది..

మళ్లీ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. ఇక వచ్చేది పెళ్లిళ్ల సమయం ఇక ఆ సమయంలో బంగారం మళ్లీ పది గ్రాములు 50 వేలకు చేరవచ్చు అంటున్నారు నిపుణులు.

 

అయితే ఇప్పుడు పెట్టుబడి పెడితే వచ్చే రోజుల్లో మరింత లాభం రావచ్చు ఇప్పుడు 42000 ఉన్న బంగారం వచ్చే మూడు నెలల్లో దాదాపు 50 వేలకు చేరవచ్చు అంటున్నారు నిపుణులు. మొత్తానికి షేర్లలో పెట్టుబడి పెరుగుతోంది.. దీంతో బంగారం పై పెట్టుబడి తగ్గింది ముఖ్యంగా ఇదే బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.