బంగారం కొనడానికి వెళితే షాపులో ఈ రూల్స్ పాటించాలి – కోవిడ్ ఎఫెక్ట్

బంగారం కొనడానికి వెళితే షాపులో ఈ రూల్స్ పాటించాలి - కోవిడ్ ఎఫెక్ట్

0
87

ఈ కోవిడ్ ఎఫెక్ట్ తో దాదాపు 70 రోజులుగా బంగారు దుకాణాలు తెరవలేదు, ఈ సమయంలో ఇప్పుడు బంగారు దుకాణాలు తెరచుకున్నాయి, అయితే బంగారు ఆభరణాలు కొనాలి అని భావించే వారు జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని రూల్స్ కూడా షాపులు పాటించాల్సిందే.. ఎంట్రన్స్ దగ్గర శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.

అలాగే బంగారం ఆభరణాలు చూసిన తర్వాత అవి కొనకపోతే వాటిని UV కిరణాలతో సానిటైజ్ చేస్తున్నారు. కస్టమర్ ఆభరణాలను తాకిన తర్వాత UV కిరణాలు ప్రసరించే బాక్స్ లో పెడతారు. అప్పుడు వైరస్ ఉంటే నశిస్తాయి. UV కిరణాల వల్ల బంగారం నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపవని జ్యువెలర్స్ చెబుతున్నాయి. ఇక భారీ ఆఫర్లు కూడా ఇప్పుడు ఇస్తున్నాయి బంగారు షాపులు.

చాలా వరకూ రెండు నెలలుగా అమ్మకాలు లేక ఇబ్బందుల్లో ఉంది బంగారు పరిశ్రమ.. ఇక ప్రతీ ఒక్కరు కూడా మాస్క్ ధరించి ఉండాలి , షాపులో పనిచేసే వారు కూడా మాస్క్ ధరించాలి, ఈ జాగ్రత్తలు అన్నీ పాటించాల్సిందే, ఇక కస్టమర్లు మాస్క్ పెట్టుకోపోతే వారిని లోపలికి అనుమతించరు.