బంగారం కొంటున్నారా కొత్త రూల్స్ వచ్చాయి – ఇలాంటి బంగారం మాత్రమే కొనాలి

బంగారం కొంటున్నారా కొత్త రూల్స్ వచ్చాయి - ఇలాంటి బంగారం మాత్రమే కొనాలి

0
87

బంగారం కొంటున్నారా అయితే కచ్చితంగా ఈ రూల్స్ అయితే తెలుసుకోండి, అవును మీరు కచ్చితంగా ఇక పై బంగారం కొనే సమయంలో బీఐఎస్ హల్ మార్క్ ఉన్న బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి, ఏ నగ తీసుకున్నా దానికి బీఐఎస్ హల్ మార్క్ ఉందా లేదా అనేది తప్పక చూసుకోండి.

 

జూన్ 1 నుంచి అమలులోకి ఈ కొత్త రూల్ రాబోతుంది.. ఇక ఏ వ్యాపారి అయినా బంగారం తో నగలు తయారు చేసి అమ్మే నగల వ్యాపారులు అయినా ఎవరైనా ఇలా బీఐఎస్ హల్ మార్కింగ్ అనేది నగపై వేసి ఇవ్వాలి.. దీని వల్ల వినియోగదారులకి రక్షణ ఉంటుంది ..అది గిల్ట్ కాదు ఒరిజినల్ నగ అని భరోసా ఉంటుంది.

 

కేంద్ర ప్రభుత్వం గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ను తీసుకువస్తోంది. జువెలర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS వద్ద రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది కచ్చితంగా వ్యాపారులు, ఇక బంగారు ఆభరణాలు 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. ఇక దీనికంటే తక్కువ ప్యూరిటీ అమ్మడానికి ఉండదు, ఇలా హాల్ మార్క్ ఉన్న బంగారం అమ్మితే కచ్చితంగా వారు దీనిని ఫ్యూచర్ లో అమ్ముకున్నా పూర్తి రేటు వస్తుంది.