ఈరోజుల్లో నగదు అవసరం అయితే వెంటనే మనం గోల్డ్ లోన్ తీసుకుంటున్నాం,, అయితే బంగారు ఆభరణాలకి మాత్రమే గోల్డ్ లోన్ ఇస్తారు, మరి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
గతంలో మీరు తాకట్టు పెట్టే బంగారం విలువలో 75 శాతం మాత్రమే లోన్ వచ్చేది. ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయంతో మీకు 90 శాతం వరకూ రుణం వస్తుంది, లోన్ టు వ్యాల్యూ రేషియో-LTV రేషియో అంటారు, దీని వల్ల మీరు బంగారం ఎంత రేటు ఉంటే అందులో 90 శాతం తీసుకోవచ్చు.
ఉదాహరణకు పది గ్రాముల బంగారం మార్కెట్లో 50 వేల రూపాయలు ఉంటే మీకు 90 శాతం నగదు ఇవ్వడం జరుగుతుంది.. అంటే మీకు గోల్డ్ లోన్ సుమారు 45 వేల రూపాయలు వస్తుంది, గతంలో కంటే ఇప్పుడు 15 శాతం పెంచారు, సో బంగారం లోన్ తీసుకునేవారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.. 2021 మార్చి 31 వరకు ఈ రూల్ వర్తిస్తుంది. బ్యాంకులు ఎన్ బీ ఎఫ్ సీలు కచ్చితంగా దీనిని అమలు చేస్తాయి.