మార్కెట్లో భారీగా పెరుగుదల చూపించిన పుత్తడి కాస్త మళ్లీ తగ్గుతూ వస్తోంది, మార్కెట్లో 15 రోజులు మార్కెట్ ర్యాలీ చేసింది, తాజాగా ఇప్పుడు మళ్లీ జోరు తగ్గించింది.
బంగారం ధర వెలవెలోబోయింది. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గింది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. రూ.56,240కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,560కు చేరింది.
బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర ఇంకా తగ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3000 తగ్గింది..దీంతో ధర రూ.68,100కు దిగొచ్చింది. ఇక బంగారం వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, అయితే ఇది మిడిల్ డౌన్ అని షేర్ల ధరలు అమాంతం పెరిగితే బంగారం 45 వేలకు చేరవచ్చు అని చెబుతున్నారు.