ఏడోరోజు తగ్గిన బంగారం ధర ఈరోజు బంగారం వెండి ధరలు ఇవే

ఏడోరోజు తగ్గిన బంగారం ధర ఈరోజు బంగారం వెండి ధరలు ఇవే

0
104

బంగారం ధరలు దాదాపు ఏడురోజులుగా నేల చూపులు చూస్తున్నాయి.. ఈరోజు కూడా పసిడి ధర తగ్గింది. వెండి ధర కూడా ఇలాగే తగ్గుదల నమోదు చేస్తోంది, బంగారం వెండిధరలు ఇలా రేటు తగ్గడంతో చాలా మంది కొనుగోలు దారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు, ఇక మార్కెట్లో వచ్చే రోజుల్లో ఇంకా బంగారం తగ్గుతుందా అంటే బులియన్ వ్యాపారులు ఏమి అంటున్నారో చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. రూ.51,240కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. రూ.100 తగ్గుదలతో రూ.46,900కు చేరింది.

వెండి ధర కిలో రూ.200 తగ్గుదలతో వెండి ధర రూ.66,500కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, అయితే బంగారం వెండి ధరలు ఇంకా తగ్గే అవకాశం మరో రెండు నెలల్లో ఉంటుంది అంటున్నారు.