భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈరోజు ధ‌ర‌లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈరోజు ధ‌ర‌లు ఇవే

0
89

బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ కొండెక్కుతున్నాయి, ఎక్క‌డా తగ్గ‌డం లేదు బంగారం ధ‌ర ఇప్పుడు మార్కెట్లో మ‌ళ్లీ ప‌రుగులు పెట్టింది, శ్రావ‌ణం సేల్ కు షాపులు సిద్దం అవుతున్నాయి, ఓ ప‌క్క వ్యాపారాలు లేక‌పోయినా బంగారం ధ‌ర మాత్రం ఆగ‌డం లేదు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

తాజాగా నేటి మార్కెట్ బంగారం ధ‌ర‌లు చూస్తే హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. దీంతో ధర రూ.51,470కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పొచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరుగుదలతో రూ.47,180కి చేరింది.

ఇక ఆర్న‌మెంట్ కంటే బిస్కెట్ పై పెట్టుబ‌డి పెడుతున్నారు జ‌నం, వ‌చ్చే రోజుల్లో రేటు పెరిగితే అమ్మ‌డానికి సులువు అని, ఇక వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.200 పడిపోయింది. దీంతో ధర రూ.52,800కు దిగొచ్చింది, ఈనెల 22 త‌ర్వాత బంగారం మ‌రింత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.