చాలా మంది బంగారం కొనాలి అని చూస్తున్నారు… ధర అయితే తగ్గుతోంది పెరుగుతోంది.. మరీ ముఖ్యంగా గత నెల రోజులుగా బంగారం తగ్గుదల పెరుగుదల కనిపిస్తోంది, అయితే 59 వేల రేటు నుంచి భారీగా తగ్గి ఇప్పుడు 47000 కు చేరింది.. బంగారం కొనాలి అని చూసేవారికి శుభవార్త. పసిడి ధర పడిపోయింది. భారీగా తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో రేటు రూ.47,730కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.43,750కు చేరింది. ఇక హైదరాబాద్ విశాఖ వరంగల్ మార్కెట్లో రేట్లు ఇలాగే ఉన్నాయి, దాదాపు వారం నుంచి చూస్తే ఈ రోజు తగ్గుదల కనిపించింది.
బంగారం ధర తగ్గితే . వెండి రేటు కూడా కేజీకి రూ.1,300 తగ్గింది. దీంతో రేటు రూ.74,400కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం మరింత తగ్గుతుంది అని వెండి రేటు కూడా భారీగా తగ్గే ఛాన్స్ ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.