బంగారం ధర భారీగా తగ్గుతోంది, గడిచిన మూడు రోజులుగా పసిడి ధర తగ్గుతూనే ఉంది, తాజాగా నేడు కూడా బంగారం ధర తగ్గింది, ఇక వెండి కూడా ఇదే దారిలో నడిచింది.
బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 దిగొచ్చింది. దీంతో ధర రూ.50,620కు చేరింది. ఇలా ఐదు రోజుల్లో పసిడి ధర రూ.340 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర రూ.310 పెరుగుదలతో రూ.46,410కు చేరింది.
ఇక బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా ఇలాగే ఉంది… కేజీ వెండి ధర ఏకంగా రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.49,200కు చేరింది.. ఇక బంగారం మరికొన్ని రోజులు మార్కెట్లో ధర తగ్గుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.