భారీగా పెరిగిన బంగారం ధ‌ర – ఈరోజు రేట్లు ఇవే ఆల్ టైం హై

భారీగా పెరిగిన బంగారం ధ‌ర - ఈరోజు రేట్లు ఇవే ఆల్ టైం హై

0
132

బంగారం ధర మార్కెట్లో భారీగా పెరుగుతోంది, ఇక గురువారం రోజు రేట్లు భారీగా పెరిగాయి.
గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరిగింది. దీంతో ధర రూ.55,310కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డ్ రేట్ అనే చెప్పాలి.

ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.50,740కు చేరింది, దాదాపు ఎనిమిది రోజులుగా బంగారం ధ‌ర ఇలా భారీగా పెరుగుతోంది.
కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.66,050కు చేరింది.

ఇటు బంగారం వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి, ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు, ఇటు భారీగా బంగారం ధ‌ర పెర‌గ‌డంతో ఈ శ్రావ‌ణంలో సేల్ ఎలా ఉంటుందా అని వ్యాపారులు డైల‌మాలో ఉన్నారు, వ‌చ్చే రోజుల్లో ఇంకా బంగారం పెరుగుతుంది కాని తగ్గేది లేదు అంటున్నారు వ్యాపారులు.