భారీగా త‌గ్గిన బంగారం ధర.. వెండి షాక్.. ఈ రోజు రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం ధర.. వెండి షాక్.. ఈ రోజు రేట్లు ఇవే

0
78

బంగారం ధ‌ర త‌గ్గుతూ వ‌స్తోంది, మ‌రో ప‌క్క ఎనిమిది రోజులుగా త‌గ్గిన బంగారం నిన్న ఒక్క రోజు భారీగా పెరిగింది,నేడు మాత్రం కాస్త త‌గ్గింది గోల్డ్, అయితే ఇది స‌రికొత్త డౌన్ ట్రేడ్ అనే చెప్పాలి, అంత‌ర్జాతీయంగా త‌గ్గుద‌ల నేప‌థ్యంలో నేడు బంగారం ధ‌ర ‌త‌గ్గింది.

ఇక వ‌చ్చే రెండునెల‌లు బంగారం ధ‌ర‌లు ఇలానే ఉంటాయి అంటున్నారు వ్యాపారులు.హైదరాబాద్ మార్కెట్లో గత పది రోజుల కాలంలో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.770 పడిపోయింది. మ‌రి నేడు ఎంత త‌గ్గింది అనేది చూస్తే. ఈరోజు బంగారం ధర రూ.180 వరకు త‌గ్గింది.

దీంతో ధర రూ.49,720కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.54,200కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే.. ఇదే కాలంలో వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,590 పెరిగింది. దీంతో ధర రూ.68,700కు చేరింది. ఇక వ‌చ్చే రోజుల్లో బంగారం ధ‌ర‌లు త‌గ్గే సూచ‌న‌లు లేవు అంటున్నారు వ్యాపారులు.