అప్ డేట్ – స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈరోజు రేట్ ఎంతంటే

అప్ డేట్ - స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈరోజు రేట్ ఎంతంటే

0
85

బంగారం ధ‌ర మార్కెట్లో గ‌డిచిన రెండు రోజులుగా త‌గ్గుతూనే ఉంది, నేటి మార్కెట్లో కూడా ప‌సిడి ధ‌ర త‌గ్గింది, దీంతో శ్రావ‌ణం ఎంట్ర‌న్స్ లో బంగారం పెరుగుతుంది అని చూస్తున్న వారు ఇప్పుడు కొనుక్కోవ‌డం బెట‌ర్ అంటున్నారు నిపుణులు, వ‌చ్చే 15 రోజుల్లో శ్రావ‌ణం సేల్ ఉంటుంది, సో మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు.

ఇక ప‌సిడి ధ‌ర‌లు చూస్తే హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60 దిగొచ్చింది. దీంతో ధర రూ.46,270కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గుదలతో రూ.50,880కు చేరింది.

ఇక బంగారం ధ‌ర ఇలా ఉంటే వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది మార్కెట్లో ఇది కూడా త‌గ్గుతోంది. కిలో వెండి 50 రూపాయ‌లు త‌గ్గింది, దీంతో ధర రూ.48,550కు పడిపోయింది, వ‌చ్చే 15 రోజుల వ‌ర‌కూ బంగారం ధ‌ర త‌గ్గినా, ఈ నెల‌ 20 నుంచి రేట్ మాత్రం పెరుగుతుంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.