గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

0
80

పుత్త‌డి మ‌ళ్లీ త‌గ్గింది బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా త‌గ్గుతూనే వ‌స్తోంది, నేడు కూడా మార్కెట్లో బంగారం ధ‌ర త‌గ్గింది, ప‌సిడి ధ‌ర త‌గ్గ‌డం ఇది ఈ నెల‌లో 13 సార్లు అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర త‌గ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది.. ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,720కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.510 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,240కు చేరింది.

బంగారం ఇలా ఉంటే వెండి ధ‌ర కూడా కాస్త పెరుగుతోంది… కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పైకి కదిలింది. దీంతో ధర రూ.66,300కు చేరింది.వ‌చ్చే రోజుల్లో బంగారం ధ‌ర మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.. షేర్ల ర్యాలీతో బంగారం త‌గ్గాలి మిన‌హా ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అంటున్నారు.