బంగారం ధర మళ్లీ జిగేల్ మంది, కాస్త స్వల్పంగా బంగారం ధర పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడంతో ఇప్పుడు బంగారం ధర మన ఇండియాలో కూడా పెరుగుతోంది.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరిగింది. దీంతో ధర రూ.48,880కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.20 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,310కు పెరిగింది
ఇక బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా పెరిగింది..కేజీ వెండి ధర ఏకంగా రూ.150 పెరిగింది. దీంతో ధర రూ.67,200కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, వచ్చే రోజుల్లో షేర్ల ర్యాలీ కొనసాగితేనే బంగారం ధర తగ్గుతుంది అంటున్నారు