మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ – భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ - భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
63

నేడు పుత్త‌డి ధ‌ర త‌గ్గింది. బంగారం ధ‌ర మ‌ళ్లీ మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది, బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా త‌గ్గుతూనే వ‌స్తోంది, నేడు కూడా మార్కెట్లో త‌గ్గింది బంగారం ధ‌ర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర భారీగానే దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760 పడిపోయింది. దీంతో ధర రూ.52,470కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.700 తగ్గింది. దీంతో ధర రూ.48,100కు దిగొచ్చింది.

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో త‌గ్గింది. భారీగా దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1600 తగ్గింది. దీంతో వెండి ధర రూ.59,000కు చేరింది..ఇంకా వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్ల‌లో పెట్టుబ‌డులు మ‌ధుప‌రులు పెట్ట‌డంతో భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది, వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంటుంది అని అంటున్నారు అన‌లిస్టులు.