భారీగా పెరిగిన బంగారం ధ‌ర టుడే రేట్ ఎంతంటే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర టుడే రేట్ ఎంతంటే

0
86

బంగారం ధ‌ర భారీగా త‌గ్గుతూ వ‌చ్చింది రెండు రోజులుగా.. కాని ఇప్పుడు మార్కెట్లో బంగారం ధ‌ర భారీగా పెరుగుద‌ల క‌నిపిస్తోంది, బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ ఆల్ టైం హైకి చేరుకుంటున్నాయి, నేడు బంగారం ధ‌ర ప‌రుగులు పెట్టింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పైకి కదిలింది. రూ.50,990కు చేరింది.. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.46,780కు చేరింది.

ఇక వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది మార్కెట్లో.. కేజీ వెండి ధర ఏకంగా రూ.820 పెరిగింది. దీంతో ధర రూ.50,020కు ఎగసింది.మార్కెట్లో బంగారం ధ‌రలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, శ్రావ‌ణం సేల్ కి బంగారం మ‌రింత పెరుగుతుంది అంటున్నారు.