బంగారం ధర భారీగా పెరిగింది, రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ నేడు కాస్త పరుగులు పెట్టింది…హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర భారీగా పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.420 పెరుగుదలతో రూ.53,240కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 పెరిగింది. దీంతో ధర రూ.48,810కు చేరింది.
బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.1500 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,900కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా తగ్గుతుందా అంటే వచ్చే రోజుల్లో బంగారం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు అనలిస్టులు.
ఇక వెండి కూడా మార్కెట్లో ధర పెరిగే సూచనలు లేవు వచ్చే రోజుల్లో 53000 నుంచి 56000 మధ్య రేట్లు ఉండే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు, అయితే సంక్రాంతి తర్వాత రేట్లు తగ్గే సూచనలు ఉన్నాయి.