భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

0
533

బంగారం ధర మళ్లీ పెరుగుదల కనిపించింది, తగ్గుతుంది అని అనుకున్న బంగారం ధర మళ్లీ ఈ రోజు కాస్త పరుగులు పెట్టింది..
ఇక బంగారం బాటలో వెండి కూడా నడిచింది, వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది, మరి మార్కెట్లో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి, మరి ఈ రోజు బులియన్ రేట్లు చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరుగుదలతో రూ.51,940కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.270 పెరిగింది. దీంతో ధర రూ.47,610కు
చేరింది.

బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో వెండి ధర రూ.65,300కు చేరింది, వచ్చేరోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.