బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? 9000 తగ్గింది ఇది తెలుసుకోండి

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? 9000 తగ్గింది ఇది తెలుసుకోండి

0
85

ఈ రోజుల్లో చాలా మంది స్టాక్స్ లేదా బంగారంలో ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు, అయితే చాలా వరకూ ఈ కరోనా సమయంలో చేతిలో నగదు లేక ఇబ్బందిపడ్డారు అందుకే పెద్దగా బంగారం కొనలేదు ఎవరూ, అయితే బంగారంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఇప్పుడు, అందుకే బంగారంలో పెట్టుబడి అంటే కాస్త ఆచితూచి ఆలోచించాలి అంటున్నారు అనలిస్టులు.

బంగారం ధర ఆగస్ట్ నెలలో ఏకంగా ఆల్టైమ్ గరిష్ట స్థాయికి తాకింది. ఆగస్ట్ 7న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.59,130కు చేరింది. ఇక వెండి గురించి కూడా చెప్పక్కర్లేదు ..ఏకంగా వెండి ధర కేజీకి ఏకంగా రూ.76,510 కి చేరింది భారీగా పెరుగుతుంది అని భావించి చాలా మంది కొనుగోలు చేశారు కాని ఇప్పుడు.

మూడు నెలలకు సీన్ మారింది… భారీగా తగ్గింది వెండి బంగారం ధర ఏకంగా 9 వేలు తగ్గింది బంగారం ధర 3 నెలలకి
.. మార్కెట్లో ఇప్పుడు బంగారం ధర 10 గ్రాములకు రూ.49,750 దగ్గర ఉంది. ఆగస్ట్ నెల నుంచి చూస్తే బంగారం ధర ఏకంగా రూ.9 వేలకు పైగా తగ్గింది, ఇక వెండి చూస్తే 11500 తగ్గింది సో పెట్టుబడి పెట్టి లాభాలు రావాలి అంటే ఇప్పుడు బంగారం బెటర్ కాదు అంటున్నారు అనలిస్టులు, వచ్చే మూడు నెలల్లో కూడా బంగారం తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు.