1500 తగ్గిన బంగారం ధర భారీగా తగ్గిన పుత్తడి రేట్లు ఇవే

1500 తగ్గిన బంగారం ధర భారీగా తగ్గిన పుత్తడి రేట్లు ఇవే

0
80

పసిడి ధర తగ్గుతూ వస్తోంది ..మొన్న ఒక్కరోజే 900 తగ్గిన బంగారం ధర మళ్లీ నేడు కూడా భారీగా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ఇక బంగారం తగ్గితే వెండి ధర మాత్రం కాస్త పెరుగుదల నమోదు చేసింది. మరి బంగారం రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 తగ్గింది. రూ.49,750కు తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 తగ్గుదలతో రూ.45,600కు చేరింది, ఇక దాదాపు రెండు రోజుల్లో 1500 తగ్గింది బంగారం ధర.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.64,800కు చేరింది. అయితే మార్కెట్లో కాస్త డిమాండ్ వెండికి పెరిగింది దీంతో వెండి రేట్లు పెరుగుతున్నాయి వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.