భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
83

బంగారం ధ‌ర మార్కెట్లో త‌గ్గుతోంది, నిన్న‌టి వ‌ర‌కూ భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈ రోజు మార్కెట్లో త‌గ్గింది..బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైపైకి కదిలింది. ఇక బంగారం చాలా మంది శ్రావ‌ణం కావ‌డంతో కాస్త కాసు అయినా కొనాలి అని చూస్తారు ఈ స‌మ‌యంలో త‌గ్గ‌డం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 దిగొచ్చింది. దీంతో ధర రూ.51,240కు చేరింది.. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.46,950కుచేరింది.

ఇక బంగారం ధ‌ర ఇలా ఉండే వెండి ధ‌ర మాత్రం ప‌రుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.240 పెరిగింది. దీంతో ధర రూ.53,150కు ఎగసింది. బంగారం ధ‌ర మ‌రింత త‌గ్గే సూచ‌న‌లు అయితే లేవు అంటున్నారు వ్యాపారులు, ఇక వ‌చ్చే రోజుల్లో భారీగా పెరుగుతుంది అంటున్నారు.