భారీగా పెరిగిన బంగారం ధ‌ర త‌గ్గిన వెండి

భారీగా పెరిగిన బంగారం ధ‌ర త‌గ్గిన వెండి

0
129

బంగారం ధ‌ర ఆల్ టైం హైకి చేరుతోంది, ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు, ప‌రుగులు పెడుతోంది బంగారం ధ‌ర ..హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగింది,దీంతో ధర రూ.55,600కు చేరింది.

ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరుగుదలతో రూ.51,030కు చేరింది.వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.3050 దిగొచ్చింది.

దీంతో ధర రూ.63,000కు చేరింది. ఇక వెండికి పెద్ద డిమాండ్ లేక‌పోవ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు.బంగారం ధర ఔన్స్‌కు 1954 డాలర్లకు చేరింది అంత‌ర్జాతీయ మార్కెట్లో.