శుభవార్త: దిగొచ్చిన బంగార ధర…తగ్గిన వెండి

శుభవార్త: దిగొచ్చిన బంగార ధర...తగ్గిన వెండి

0
124

బంగారం ధ‌ర భారీగాపెరుగుతూ వ‌చ్చింది, అయితే తాజాగా బంగారం ధ‌ర ప‌దిహేను రోజులుగా పెరిగింది ఒక్క‌సారిగా త‌గ్గుద‌ల న‌మోదు చేసింది. ఈరోజు బంగారం ధ‌ర మార్కెట్లో కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి ధ‌ర త‌గ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 త‌గ్గింది. దీంతో ధర రూ.58,690కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.400 త‌గ్గ‌డంతో రూ.53,800కు దిగొచ్చింది.

ఇక బంగారం బాట‌లోనే వెండి ధ‌ర కూడా న‌డుస్తోంది.కేజీ వెండి ధర ఏకంగా రూ.2310 త‌గ్గింది, దీంతో
ధర రూ.74,200కు పడిపోయింది. బంగారం ధర ఔన్స్‌కు 2034 డాలర్లకు చేరింది. 28.28 డాలర్లకు వెండి చేరింది, బంగారం వ‌చ్చే రోజుల్లో త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు అన‌లిస్టులు.