భారీగా తగ్గిన బంగారం ధ‌ర వెండి ధ‌ర ఢ‌మాల్

భారీగా తగ్గిన బంగారం ధ‌ర వెండి ధ‌ర ఢ‌మాల్

0
189

పెరుగుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ తగ్గింది… రెండు రోజులు త‌గ్గిన ప‌సిడి ధ‌ర మ‌ళ్లీ నేడు త‌గ్గింది, అంత‌ర్జాతీయ ప‌రిస్దితుల వ‌ల్ల బంగారం ధ‌ర మ‌రింత త‌గ్గుతోంది అంటున్నారు నిపుణులు, మ‌రీ ముఖ్యంగా వెండి ధ‌ర కూడా భారీగా త‌గ్గుతూ వ‌స్తోంది.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర త‌గ్గింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.780 త‌గ్గింది. దీంతో ధర రూ.55,460కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా త‌గ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.720 తగ్గుదలతో రూ.50,840కు చేరింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో ఉంది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.1100 పడిపోయింది. దీంతో ధర రూ.67,000కు దిగొచ్చింది. మార్కెట్లో షేర్ల ధ‌ర‌లు ర్యాలీ చేశాయి, అందుకే భారీగా బంగారం ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు అన‌లిస్టులు.