భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం వెండి ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
82

నేడు పుత్త‌డి ధ‌ర త‌గ్గింది. బంగారం ధ‌ర మ‌ళ్లీ మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది, బంగారం ధ‌ర గ‌డిచిన వారం రోజులుగా త‌గ్గుతూనే వ‌స్తోంది, నేడు కూడా మార్కెట్లో త‌గ్గింది బంగారం ధ‌ర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రేట్లు చూస్తే. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 త‌గ్గింది. దీంతో ధర రూ.54,050కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.550 త‌గ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,480కు చేరింది.

పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగానే తగ్గింది. కేజీ వెండి ధర రూ.1200 దిగొచ్చింది. దీంతో ధర రూ.65,500కు చేరింది. ఇంకా వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్ల‌లో పెట్టుబ‌డులు మ‌ధుప‌రులు పెట్ట‌డంతో భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది, వ‌చ్చే రోజుల్లో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంటుంది అని అంటున్నారు అన‌లిస్టులు.