భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం రికార్డ్ వెండి ధ‌ర‌ జంప్

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం రికార్డ్ వెండి ధ‌ర‌ జంప్

0
89

త‌గ్గుతూ పెరుగుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర నేడు కూడా మార్కెట్లో మ‌ళ్లీ జోష్ తో కాస్త రేటు పెరిగింది, ఒకేసారి ఈ రోజు ధ‌ర పెర‌గ‌డంతో బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1040 పరుగులు పెట్టింది. దీంతో ధర రూ.56,360కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.970 పెరుగుదలతో రూ.51,670కు చేరింది.

వెండి ధర కూడా ఇదే దారిలో పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.71,100కు చేరింది.. ఇక వ‌చ్చే రోజుల్లో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, చాలా వ‌ర‌కూ షేర్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం తగ్గించారు మ‌దుప‌ర్లు మ‌ళ్లీ అందుకే బంగారం ధ‌ర జంప్ అవుతోంది.