బ్రేకింగ్ – పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే

0
74

గత నెలలో పరుగులు పెట్టిన బంగారం ధర జూన్ నెలలో కూడా పరుగులు పెట్టింది… ఈ నెలలో కూడా పుత్తడి కొత్త రేట్లతో దూసుకుపోతోంది… ఇక నిన్న నిలకడగా ట్రేడ్ అయిన బంగారం ధర నేడు కాస్త పరుగులు పెట్టింది… మరి వెండి రేటు ఎలా ఉంది బులియన్ మార్కెట్లో అమ్మకాలు రేట్లు ఓసారి చూద్దాం.పసిడి రేటు పరుగులు పెట్టింది. అలాగే వెండి రేటు కూడా పెరిగింది .

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో రూ.50,400కు ట్రేడ్ అవుతోంది… 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.46,200కు ట్రేడ్ అవుతోంది. ఇక గడిచిన నాలుగు రోజుల్ల చూస్తే వరుసగా మూడు రోజులు బంగారం ధర పెరిగింది.

బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.900 పెరిగింది… దీంతో కేజీ వెండి ధర రూ.77,500కు ట్రేడ్ అవుతోంది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.