ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ స్కామ్ ఇదే…. 83 వేల టన్నులు

ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ స్కామ్ ఇదే.... 83 వేల టన్నులు

0
91

బంగారం కొనుక్కునే వారు చాలా మంది మంచి న‌గ‌ల షాపులో తీసుకుంటారు.. లేక‌పోతే రాగిశాతం ఎక్కువ గోల్డ్ శాతం త‌క్కువ ఇస్తారు అనే భ‌యంతో, అయితే కొంద‌రు వ్యాపారులు ఇలాగే మోసం చేస్తారు, చిన్న చిన్న వ‌స్తువులు ల‌క్ష‌ల్లో ఉంటాయి కాని భారీ స్కామ్ ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది, ప్ర‌పంచంలో ఇదే అతి పెద్ద గోల్డ్ స్కామ్.

చైనా వుహాన్‌లోని కింగ్ గోల్డ్ జువెలరీ కంపెనీ… మొత్తం 83 టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి… 16 బిలియన్ యువాన్ల (రూ.16900 కోట్లు) రుణం తీసుకుంది. మొత్తం 14 సంస్థల నుంచి కింగ్ గోల్డ్… బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు తెలిసింది.

అయితే ఇందులో ఓ మోసం ఉంది. తాక‌ట్టుపెట్టిన బంగారంలో పైన పూత బంగారం లోప‌ల అంతా రాగి ఉంది, దాదాపు ఈ కంపెనీ రియ‌ల్ ఎస్టేట్ తో చిన్న చిన్న న‌గ‌రాల‌ను నిర్మించింది..కింగ్ గోల్డ్ సంస్థ వ్యవస్థాపకుడు జియా జిహోంగ్‌ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ కంపెనీ విష‌యాలు అన్నీ ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.