గుడ్ న్యూస్, నేడు కూడా పుత్తడి ధర భారీగా తగ్గింది. వరుసగా ఆరు రోజులుగా బంగారం ధర పెరుగుతూ ఉంది నేడు కాస్త తగ్గింది.., పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అయితే ఇంకా బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గడంతో .52,410కు తగ్గింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.48,050కు తగ్గింది.
కేజీ వెండి ధర ఏకంగా రూ.1800 తగ్గింది ఈరోజు . దీంతో వెండి ధర రూ.62,200కు దిగొచ్చింది. పసిడి ధర పడిపోతే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది..ఇంకా వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్లలో పెట్టుబడులు మధుపరులు పెట్టడంతో భారీగా బంగారం ధర తగ్గుతోంది, వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అనలిస్టులు.