రెండు రోజులుగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి… నిన్న పెరిగిన బంగారం ధర మళ్లీ నేడు మార్కెట్లో పరుగులు పెట్టింది. నేడు స్వల్పంగా బంగారం ధర పెరిగింది, మరి మార్కెట్లో బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం, అయితే అమ్మకాలు స్వల్పంగా ఉన్నాయి అని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు, కాని ఈ వేళ గోల్డ్ వెండి ధరలు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.51,930కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 పెరిగింది. దీంతో ధర రూ.47,610కు చేరింది.
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది… కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,600కు చేరింది. బంగారం వెండి ధరలు భారీగా పెరగడంతో కాస్త అమ్మకాలు తగ్గాయి, అయితే జనవరి వరకూ బంగారం వెండి ధరలు ఇలాగే ఉంటాయి అని వచ్చే రోజుల్లో ( జనవరి తర్వాత ) తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు అనలిస్టులు.