మూడోరోజు తగ్గిన బంగారం – వెండి మాత్రం పరుగులు ఈరోజు రేట్లు ఇవే

మూడోరోజు తగ్గిన బంగారం - వెండి మాత్రం పరుగులు ఈరోజు రేట్లు ఇవే

0
90

గత నెల రోజులుగా బంగారం ధర పరుగులు పెట్టింది.. ఈ నెలలో మాత్రం బంగారం ధర తగ్గుదల కనబరిచింది, ముఖ్యంగా ఈ నెలలో బంగారం ఒకే రోజు 1600 వరకూ తగ్గింది. పసిడి ధర తగ్గడం ఇది మూడో రోజు.. నేడు కూడా పుత్తడి ధర తగ్గింది, మరి బంగారం వెండి ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయి. ఈ రోజు తగ్గుదల ఎంత కనబరిచింది అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గింది.. రూ.51,630కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గుదలతో రూ.47,300కు చేరింది.. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది.రూ.200 పెరుగుదలతో వెండి ధర రూ.68,300కు చేరింది.

ఇక బంగారం వెండి ధరలు కచ్చితంగా వచ్చే రోజుల్లో తగ్గుతాయని వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలాంటి రేట్లు ఉన్నా జనవరి 20 నుంచి బంగారం రేటు తగ్గుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు. ఓ పక్క షేర్లు పుంజుకుంటున్నాయి అందుకే బంగారం ధర తగ్గుదల కనిపిస్తోంది.