నేడు పుత్తడి ధర భారీగా తగ్గింది. బంగారం ధర మళ్లీ మార్కెట్లో తగ్గుముఖం పట్టింది, బంగారం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోంది, నేడు కూడా మార్కెట్లో తగ్గింది బంగారం ధర, పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గడిచిన మూడు నెలల్లో తగ్గని విధంగా ఆరు వేలు పైనే వెండి ధర తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.590 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,230కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.540 తగ్గింది. దీంతో ధర రూ.48,800కు దిగొచ్చింది.
పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.6400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.60,600కు చేరింది.. ఇంకా వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, షేర్లలో పెట్టుబడులు మధుపరులు పెట్టడంతో భారీగా బంగారం ధర తగ్గుతోంది, వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అనలిస్టులు.