గుడ్ న్యూస్ అసెంబ్లీ సీట్ల పెంపు పై కేంద్రం క్లారిటీ

గుడ్ న్యూస్ అసెంబ్లీ సీట్ల పెంపు పై కేంద్రం క్లారిటీ

0
89

ఏపీ తెలంగాణలో ఎన్నికల ముందు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది అని అందరూ భావించారు.. అయితే కేంద్రం మాత్రం గుడ్ న్యూస్ చెప్పలేదు.. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అలాగే ఇక్కడ ఏపీలో కూడా ఎన్నికలు జరిగాయి .. దీంతో అసెంబ్లీ సీట్ల పెంపు గురించి ఇంక చర్చలు జరగలేదు.

అయితే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అనేది దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి జరుగుతుంది అని తెలిపారు, అప్పటి వరకూ ఆగాల్సిందే అన్నారు ఆయన.

తెలుగు రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల పెంపు చేపట్టలేమని స్పష్టం చేశారు. అయినా సీట్ల పెంపు అంశం ప్రస్తుతం న్యాయవిభాగం ముందు ఉందని వెల్లడించారు. దీనిపై న్యాయవిభాగం నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన వెల్లడించారు, అయితే రెండు చోట్ల ఎన్నికలు అయ్యాయి సో వచ్చే నాలుగేళ్ల తర్వాత మాత్రమే ఈ పెంపు గురించి మళ్లీ చర్చ జరిగే అవకాశం ఉంది.