కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త కరోనా తగ్గుముఖం పట్టింది అనే చెప్పాలి, అయితే తెలంగాణ ఏపీలో కూడా కేంద్రం ఇచ్చిన పలు గైడ్ లైన్స్ పాటిస్తున్నారు. కరోనా విద్యాసంస్థల ప్రారంభంపై తీవ్ర ప్రభావమే చూపింది.. ఇక, ఎడ్యుకేషన్ ఇయర్ కూడా కోల్పోయే ప్రమాదం ఉండడంతో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇక మెజార్టీ ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి, ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు చాలా వరకూ ఇదే ఫాలో అవుతున్నాయి, ఇక పిల్లలకు కూడా ఆన్ లైన్ క్లాసులు బాగా అలవాటు చేస్తున్నారు. ఇక కొన్ని తరగతుల వారికి స్కూళ్లకు పంపాలి అంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఇవ్వాలి అని తెలిపారు
తెలంగాణలో ఈ నెల 15 తర్వాత విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని తెలుస్తోంది, దసరా తర్వాత నిర్ణయం తీసుకుంటారు. యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు నవంబర్ 1 నుంచి యథావిధిగా ప్రారంభం అవుతాయని తెలిపింది.