తెలంగాణలో వైఎస్ షర్మిల త్వరలో పార్టీ పెడుతున్నారనే విషయం తెలిసిందే …ఇటీవల ఆమె తెలంగాణలో వైయస్ అభిమానులతో మాట్లాడారు, అన్నీ జిల్లాల నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నారు.. మరోపక్క కొద్ది రోజులుగా తెలంగాణకు చెందిన నాయకులు, విద్యార్థులతో సమావేశాలు జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రజలకు త్వరలోనే శుభవార్త చెబుతానని ఆమె తెలిపారు. ఇక త్వరలోనే పార్టీ సిద్దాంతాలు ప్రకటిస్తాము, అలాగే పార్టీ పేరు కూడా ప్రకటిస్తాము అని తెలిపారు, దీనికి సంబంధించి వర్క్ జరుగుతోంది అని ఈ శుభవార్త త్వరలో చెబుతాము అన్నారు.
తన పార్టీకి తల్లి వైఎస్ విజయమ్మ మద్దతు ఉంటుందని తెలిపారు.. ప్రాంతాలు, పార్టీల పరంగా మేము వేర్వేరుగా ఉండొచ్చని కానీ, అనుబంధాల్లోనూ, అన్నాచెల్లెల్లుగా తానూ, సీఎం జగన్ ఒకటేనని షర్మిల స్పష్టంచేశారు… తాను తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు ముందుకు వచ్చాను అని తెలిపారు. ఇక తాను పుట్టింది పెరిగింది తెలంగాణలో అని ఆమె తెలిపారు.