ఈ వైరస్ తో పూర్తిగా మానవాళి డైలమాలో ఉన్నారు, దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గ్లెన్మార్క్ అనే ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో మందు బిళ్లలు తయారు చేసినట్లుగా ప్రకటించింది, ధర కూడా 110 రూపాయలు లోపు చెబుతోంది.
ఇది ప్రాధమికంగా తక్కువ లక్షణాలు కనిపించిన వారికి మాత్రమే అని తెలియచేసింది కంపెనీ..
తాజాగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో కరోనాను కట్టడిచేసే రెమ్డిసివిర్ ఔషధాన్ని ఆవిష్కరించింది. ఇది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది.
ఇది మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి..డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాము అనుమతి పొందినట్లు వెల్లడించింది కంపెనీ..కోవిఫర్ అనే పేరుతో మార్కెట్లోకి రానుంది అని తెలిపింది.ఇప్పటికే ఈ ఇంజెక్షన్లను లక్ష డోసుల మేర సిద్ధం చేశామని తెలిపింది.