గుడ్ న్యూస్ – క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేసింది 12న పంపిణీ

గుడ్ న్యూస్ - క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేసింది 12న పంపిణీ

0
74

ర‌ష్యా అనుకున్న‌ది సాధించింది, ముందు ర‌ష్యానా అమెరికానా ఎవ‌రు మందు క‌నిపెడ‌తారు అని గ‌త నెల నుంచి అంద‌రూ అనుకున్నారు. మూడు ట్ర‌య‌ల్స్ కూడా పూర్తి చేసుకుని ర‌ష్యా ముందుకు వ‌చ్చేసింది.
ఇక క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసేసింది.

ఈ నెల 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది, అయితే దీనిపై అమెరికా కూడా స్పందించింది..ఈ వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని చెబుతోంది యూఎస్.

ఈ వ్యాక్సిన్ ను గమలేయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ క‌లిసి త‌యారు చేశాయి, ఇక ముందుగా వీటిని ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ అయిన వైద్యులు మెడికల్ సిబ్బందికి, వయో వృద్ధులకు ఇస్తారు. ఇక ప‌రీక్ష‌ల‌లో మూడు ద‌శ‌ల ప్ర‌క్రియ పూర్తి అయిన‌ట్లు వెల్లడించారు..సగం మందికి ఇంజక్షన్ రూపంలో, మిగతావారికి పౌడర్ రూపంలో వ్యాక్సిన్ ను ఇచ్చామని అధికారులు వెల్ల‌డించారు. ఇది స‌త్ఫ‌లితాలు ఇచ్చింది అని తెలిపారు అక్క‌డ అధికారులు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ డోసులు భారీ ఎత్తున బ‌య‌ట‌కు రానున్నాయి.