లాక్ డౌన్ తో వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. పలు ప్రాంతాల్లో వారు చిక్కుకుపోయారు, వారిని సొంత గ్రామాలకు తీసుకువెళ్లేందుకు కేంద్రం శ్రామిక్ రైళ్లను నడుపుతోంది, ఓపక్క రాజధాని నుంచి మొదలైన ఈ ట్రైన్స్ ఇప్పుడు అన్నీ రాష్ట్రాలకు కూలీలను తీసుకుని వెళుతున్నాయి.
అయితే ఇలా తీసుకువెళ్లే సమయంలో వారిని క్వారంటైన్ చేయాలి కాబట్టి ఆయా రాష్ట్రాల అనుమతి తీసుకుని వారిని తరలించేవారు, కాని ఇప్పుడు ఇలాంటి పర్మిషన్ అక్కర్లేదని ఎంత మంది ఉన్నా ఆ రాష్ట్రం వారు ఉంటే వారిని ప్రభుత్వాన్ని అడగకుండా తీసుకువెళ్లవచ్చు అని కేంద్రం తెలిపింది.
తాజాగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ జారీ చేసింది. దాని ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని వలస కార్మికులను పంపడానికి అవసరమైన వివరాలను రైల్వే శాఖకు అందిస్తే సరిపోతుంది. అయితే ఇలా వెళ్లిన వలస కూలీలు మాత్రం కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి.