ఈ మండే ఎండలతో అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, ఉక్కపోత తట్టుకోలేకపోయారు, తాజాగా వాతావరణ శాఖ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని ఎదురుచూశారు, ఇక గుడ్ న్యూస్ చెప్పేసింది వాతావరణ శాఖ, ఇక వర్షాలు కురుస్తాయని తెలిపింది, దీనికి కారణం నైరుతి రుతుపవనాలు భారత్ కు రానే వచ్చాయి.
ఈ నైరుతి రుతుపవనాల ఆగమనం కేరళలోకి సోమవారం ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది..అందుకే చాలా స్టేట్స్ లో వాతావరణం కూల్ అయింది, తెలంగాణ ఏపీలో కూడా వాతావరణం చల్లబడింది, ఇప్పుడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అనుకున్న సమయానికే రుతుపవనాలు చేరుకున్నాయని ఈసారి వర్షాలు బాగానే కురిసే అవకాశం ఉంది అని తెలిపారు,జూన్ 5న కేరళ తీరం తాకుతాయి అని అనుకున్న రుతుపవనాలు ఈసారి 1నే తాకాయి.